సగటు మదుపరి తదుపరి బడ్జెట్ కోసం బండెడు ఆశతో చూసాడు
అమ్మేసి బయట పడుదాము ఎరక్క పోయి ఇరుక్కొన్నామని ..
వచ్చే జీతాలు వచ్చినట్టే కనుమరుగయ్యి పోతుంటే
కాస్తా ఇంటి రూపంలోనైనా పోగేద్దామని
ఇరవై సంవత్సరాల నెలసరి వాయిదాలకు వెరవక అప్పులు జేసి
జీతాలు పెరగకపోయినా ఈ రోజు ఉండే ఉద్యోగంతో
బడ్జట్ కోసం ఉద్విగ్నంగా ఎదురుచూశాడు నెల జీతగాడు
ఇంటి మీద కట్టే వడ్డీ మినహాయింపు
వెసులుబాటు ఇస్తారని
ఆ మహారాజులకు ఆ మినహాయింపు ఇస్తే
మళ్ళీ మన గాలాలకు పడకపోరు
ఉన్నది అమ్మేసి బయటపడకపోము అని
రియల్ వ్యాపారులు రంగుల కలలు కంటుంటే
ఇవన్నీ మాకెందుకు వచ్చిన గొడవ
అసలే మాంద్యం దెబ్బతో ఎవడూ మా రాజకీయ పార్టీలకు
విరాళాలు ఇవ్వట్లేదు ఇటీవల అమ్మిన టికెట్ల డబ్బు
ఎన్నికలకే ఖర్చయ్యింది అని ఆలోచించి
అత్యవసరంగా ఈ బడ్జట్లో
రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలకు
వంద శాతం పన్ను మినహాయింపు ప్రకటించుకొన్నారు
అచ్చు కొంప కాలి ఏడుస్తుంటే చుట్ట వెలిగించుకొన్నట్టు.
ఉతుకులపై ఇటీవలి వ్యాఖ్యానాలు