ఒరగబెట్టుంటే ఒకింత ఆశ్చర్య పోయిండాలి

గత ఐదు సంవత్సరాలలో
అవసరమైన ఆక్సిజన్ ఆంధ్రా అందిస్తే
కేంద్రం లో పెత్తనం సాగించిన చేయి
అడుగడుగునా మొండి ‘చేయి’ చూపింది
అయినా ఆంధ్రులు మరోసారి
అందించారు చేయిని
కానీ తీరు మారని చేయి
సభాపతి మీకే అని ఊరించి తరువాత ఊసురోమనిపించారు
మంత్రి పదవుల్లోనూ మనలను వెర్రి వాళ్ళుగా జమగట్టారు
తాజాగా రైలు బడ్జట్లోనూ మనలను బడుద్దాయులను జేశారు
వంకర పోతుందని ఎంత ప్రయత్నించినా వృధానే నన్నట్టు
వరుసబెట్టి మీకు ఒరగాబెట్టేదేమీ లేదు అని
ఆంధ్రులను అడుగడుగునా అవమానిస్తున్నారు

4 స్పందనలు నుండి “ఒరగబెట్టుంటే ఒకింత ఆశ్చర్య పోయిండాలి” కు


  1. 1 amar 1:51 అపరాహ్నం వద్ద జులై 3, 2009

    ముమ్మాటికీ నిజం.

  2. 2 కొత్తపాళీ 3:29 అపరాహ్నం వద్ద జులై 3, 2009

    మనం అలా అమ్మవారికి అకుంఠిత విశ్వాసంతో ముందుకి పోతుంటామన్న మాట!

  3. 3 ప్రభాకర్ మందార 4:15 అపరాహ్నం వద్ద జులై 3, 2009

    ఇది మన స్వయం కృతాపరాధం!
    వై ఎస్ ఉద్దేశపూర్వకం గా , వ్యక్తీ గత స్వార్ధం స్వలాభం కోసం తగిన కేంద్ర మంత్రి పదవులను కోరలేదు. నిజంగా కోరి వుంటే తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల కంటే ప్రధానమైన కేబినేట్ మంత్రి పదవులు మనకు దక్కి వుండేవి.

    లోగడ చంద్రబాబు కూడా ఇట్లాగే కేంద్ర కేబినేట్ లో చేరకుండా చివరికి స్పీకర్ పదవిని మాత్రం చివరి క్షణం లో ఒప్పుకున్నాడు. రెండో సారి అదీ వదులుకున్నాడు.

    ఇదంతా కేంద్ర మంత్రి పదవులతో తన అడుగులకు మడుగులోత్తల్సిన వాళ్ళు తనకంటే ఎక్కడ పాపులర్ అయి పోటీ వస్తారో అన్న భయం వల్లనే. తనకొక్కడికే పేరు రావాలి. ఎవడూ తనను మించి ఎదగకూడదు.
    కేసీ ఆర్ డీ ఇదే ధోరణి. మన రాజకీయాలే దగుల్భాజీ రాజకీయాలై పోయాయి.

    మనవాళ్ళుట్టి వెధవాయిలోయ్ అని గురజాడ వూరికే అనలేదు. !!

  4. 4 bonagiri 4:19 పూర్వాహ్నం వద్ద జులై 4, 2009

    లాలూ భాధని అర్థం చేసుకోండి.

    తాను ప్రవేశపెట్టవల్సిన బడ్జెట్ ని మమత ప్రవేశపెట్టిందని ఆయన ఆక్రోశం.

    33 మంది ఎం.పి లని ఇచ్చి కనీసం రైల్వే సహాయమంత్రి పదవి కూడా తీసుకోలేని దౌర్భాగ్యం మన ఆంధ్రులది.

    మునియప్పని చూడండి ఎన్ని రైళ్ళు తెచ్చుకున్నాడో.


ప్రత్యుత్తరమిమ్ము




వీక్షణలు

  • 84,221

తడి ఆరని ఉతుకులు

 

జులై 2009
సో మం బు గు శు
« జూన్   ఆగ »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

నెలవారీ ఉతికినవి