ఒక కులాన్ని ఆడి పోసుకోవడానికి గీత ను
ప్రామాణికం తీసుకొని విభజించారని భజన చేయడం.
అదే గీత భారతంలో చెప్పబడింది అంటే చరిత్ర లో రాయలేదని,
చత్ ఒప్పుకొనేది లేదని భీష్మించడం.
మన దేశంలో మనుషులతో పాటు మమేకమైన కొన్ని గ్రంధాలను గర్హించడానికి
అసలున్నాయో లేవో వాటిని ఎవరు ఆచరిస్తారో తెలియని వాటిని
ప్రామాణికంగా తీసుకొని కాశీ మజిలీ కథలు అల్లడం.
అంతగా మమేకమై గ్రంధాలకు చరిత్రలో స్థానం లేదని
అభినవ చరిత్ర కారులు శోధించి తేల్చడం.
సమాజాన్ని ఉద్దరించక పోయినా ఉద్రేకాన్ని పెంచే
పెంటను ఒకపరి ఆలోచించి ఆపమనే వారికి ద్వంద్వప్రవృత్తి అంటగట్టడం.
ఒక వర్గమే సంసృతం చదివేది, వాళ్లకు తగినట్టు మార్చేసారు అనేది మరో అభియోగం
కానీ వారు చెప్పబడే సచ్చీలులైన చరిత్రకారులు కూడా
విమర్శలు ఎదుర్కొన్నారు కదా అంటే ఏమీ తెలియనట్టు ఊరుకోవడం.
సాంప్రదాయాలను పొగిడే వారికి ఉన్న హక్కులు తెగిడే వారికి కూడా తేవడానికి
నడుం కడుతామంటున్నారు బ్లాగుల ముఖంగా.
ద్వంద ప్రవృత్తి గురించి ప్రశ్నించే వారు ఒకపరి నా ముందు టపా
భారతంలో బండి తోలడం భావ్యమా? చదివి అర్థం చేసుకోవలసిందిగా అభ్యర్థిస్తున్నాను.
Good Post.
Good Post