సాధారణంగా మన దేశంలో కొన్ని ప్రాంతాలలో కొన్ని గ్రామాలు కలసి
చందాలు వేసుకొని హరికథా కాలాక్షేపాలు చేసుకోవడం మనకు తెలిసిందే.
వాటిలో భాగంగా రామాయణ, మహా భారత, భాగవతాలు చెప్పుకోవడం పరిపాటి.
అలా ఒక ప్రాంతంలో అందరూ చందాలు వేసుకొని భారతం వింటున్నారు.
అక్కడ హరికథ భాగవతార్ కు, వింటున్న భక్తులకు మధ్యలో
ఊరందరికీ ఉపయోగ పడే రహదారి ఉండేది.
ఊరందరిదీ ఒకదారి అంటే ఉలిపిరి కట్టెది ఒక దారి అన్నట్టు
ఒకడు చందా ఇవ్వక పోగా ఆ రహదారిలో జోరెడ్ల బండిలో
ఉత్తినే, అవసరం లేక పోయినా ఎంతో కొంత ఎరువు వేసుకొని
అటూ ఇటూ తిరుగుతూ అందరినీ చికాకు పెట్టేవాడు.
ఇలా సాగుతున్న సమయంలో, కొంత సమయం ఓపిక పట్టిన భక్తులు,
ఎంతో నైపుణ్యమైన ఎడ్లను ఉంచుకొని ఉన్నా,
మరచి తమ రస స్పందనకు మాటి మాటికీ అడ్డు వస్తున్నాడని తలచి,
కోపం తాళ లేక “భారతంలో బండి తోలుతావా” అంటూ వాడి తాట తీసి బహిష్కరించారంట.
ఇక్కడ వాడు సమాజానికి ఏమీ చెయ్యక పొయ్యినా పోయేదేం లేదని ఊరుకున్నారు.
న్యాయంగా చట్టానికి లోబడి ఆ దారి నిజంగా అవసరమయ్యి వాడుకుంటే ఎవడూ అభ్యంతరం చెప్పే వారు కాదు.
కానీ కావాలని వింటున్న వారి మనసులను గాయ పరచాలని చేసింది కాబట్టి కుళ్ళ బొడిచారు.
ఒక్కడంటే ఒక్కడు కూడా మద్దతు ఇవ్వలేదు.
ఇటీవల బ్లాగుల్లో వివాదాస్పద టపాలు మరియు వాఖ్యలపై
జరుగుతున్నవి చదువుతుంటే నాకు జ్ఞాపకం వచ్చిన చిన్నప్పటి కథ ఇది.
ఇక్కడ రహదారి ‘కూడలి’ అని ‘భారతంలో బండితోలే వాడిని’ నన్ను ఉద్దేశించి అని
తమకు తాము అన్వయించుకొని నా మీద పడకుండా
అన్యధా భావించక, అలా ఎవరైనా ఉంటే
భారతంలో బండి తోలితే భక్తులు భరించలేరు అని గమనించి
కొంచమన్నా మారుతారని ఆశిస్తూ
గుర్తుకు తెచ్చు కున్న కథతో ఇది మరోసారి గుర్తు జేసే ఉద్దేశం మాత్రమే.
చాలా బాగుంది కథ. అప్పుడప్పుడు ఇటువంటివి రాస్తూ ఉండండి.
Very good story!
బాగుందండి.
Very Good Story.
కథ బాగుంది, అనువర్తనా బాగుంది.
Kekaaaaaaaaaaa…….
చాలా బాగా సెలవిచ్చారు. నేను కూడా ఈ విషయమే చెప్పాలని అనుకున్నాను. కాని, నాకు ఇంత అద్భుతముగా చెప్పదలచిన విషయాన్ని సమర్పించే నేర్పరి ఇంకా వంటబట్టక, ఇన్నాళ్లు చెప్పలేకపోయాను. మీకు ఒక పెద్ద “ఓ” వేసుకుంటున్నాను.
good story