బియ్యానికి వెళితే బిత్తర పోయే పరిస్థితి
ఆడాళ్ళను ఆసిడ్తో సంపేస్తున్నారు
ఆస్టేలియాకు వెళితే ఆయాసం వచ్చే వరకు పరిగెత్తించి పనిబడుతున్నారు
కంది పప్పు రేటు వింటేనే కందిరీగ కుడితే వచ్చేంత మంటతో ఠారెత్తే స్థితి
మాంద్యం దెబ్బతో ఎప్పుడు మానాల్సి వస్తుందో అని ఐ టి నిపుణుల మనో వ్యధ
స్కూలు ఫీజులు వింటుంటే సూదులు గుచ్చుకొని ఆక్యుపంచర్ వైద్యం చేసుకొన్నంత పరిస్థితి
ఇవన్నీ పట్టించుకొని పాలకులు పరిపాలిస్తున్నట్టు
అభ్యంతరం, ఆవేశం మరియు హెచ్చరికలు అనే పదాలు పత్రికల్లో దర్శనం
యంత్రాగం ఏమో వాన కోసం యజమాని చెప్పాడని యజ్ఞ యాగాదులతో యాగీ
మొన్నటివరకు అధికారంకోసం కారాలూ మిరియాలు నూరిన పక్షాలు సమస్యలేమీ లేవన్నట్టు సమీక్షలతో సందడి చేస్తున్నాయి
అందుకే ఇప్పుడు ఎవరో వస్తారని ఏదో చేస్తారనిఎదురు చూసి మోసపోకుమా అన్నదాన్ని మరో సారి మరువక గుర్తుచేసుకొనే పరిస్థితి
keep it up!