గుర్తు నుండి గుంజాటనలే కాదు కాదు పార్టీ పెట్టడం నుండే

పార్టీ పెట్టాలా? వద్దా.. పెట్టాలా? వద్దా.. అని
తటపటాయించి తాటాకు చప్పుళ్ళు చేసి
చివరకు పెట్టి

ప్రజలే పిలిచారు కాబట్టి
ప్రజా రాజ్యమని

నారు పోసిన వాడు నీళ్ళు పోయక పోతాడా
అన్న నానుడి ప్రకారం

సభలకు పోగయ్యే జనం సగౌరవంగా
కుర్చీలో కూర్చో పెట్టరా అని కుతూహలపడి

ఇప్పుడు ఎవడు పిలిచాడురా బోడి మల్లయ్యా అనే ప్రశ్నకు
సమాధానం తీరిగ్గా వెతుకుతున్నారు…

తొలుత గొడుగు అనుకొని
ఎన్నికల సంఘం విదిలించిన రైలును
గొనుక్కోకుండా తీసుకొని
అదీ సామాజిక న్యాయ శకటమని
గొప్పలు పోయి

బుల్డోజరుతో ప్రత్యర్ధులు బోల్తా గొట్టించి
గోతిలో పడేశారని
ఇప్పుడు తీరిగ్గా వాపోతూ
వామ్మో మాకీ గుర్తు వద్దని బల్ల గుద్ది చెబుతున్నారు

పరకాల వెళ్ళాక వేలాకోలమాడుతూ
నువ్వు ఇంకా ఇక్కడే వున్నావా మిత్రమా అంటూ
ఆయన లేదంటే పార్టీనే లేదంటూ ఒక్క టేకులో చెప్పాడు చిరంజీవి

ఇన్నాళ్ళూ మిన్నకున్న మిత్రా గారు చిత్రంగా
నిశ్శబ్ద విప్లవాన్ని నమ్మే చిరుగారికి
అంతే నిశ్సబ్దంగా సెలవు చీటీ చేతికి అందించారు
అందిచినదే తడవుగా
మీడియా ఫస్ట్ ఆఫ్ లోని డైలాగును లాగి
పార్టీ ఇక లేదా అంటే
నేను పోయినా గానీ పార్టీ ఉంటుందని
మరో సారి ఒక్క టేకులో చెప్పారు

స్పీకరును ఎన్నుకొనేటప్పుడు తప్పులేదని
తరువాత పార్టీ చెప్పినదానికి తలపంకించి
తరువాత తటపటాయిస్తూ
క్రికెట్టు బాగా తెలిసిన స్పీకరుగా
సభను సజావుగా నడపండని ఓ సలహా పడేసారు

ఏదో ఒకటి సమయానికి తగినట్టు చెప్పడం
తరువాత సమయానుసారం మార్చడానికి

రాజకీయాలు, మనం చెపితే మార్చేసే స్క్రిప్టా?

ఈ పునాది రాళ్ళ హీరోకు పునాదులు కదులుతున్నా
గుంజాటనలు లేని రాజకీయాలు ఎప్పుడు ఒంటబడుతాయో?

5 స్పందనలు నుండి “గుర్తు నుండి గుంజాటనలే కాదు కాదు పార్టీ పెట్టడం నుండే” కు


  1. 1 అమర్ 4:36 అపరాహ్నం వద్ద జూన్ 24, 2009

    బాగా చెప్పారు.

  2. 3 bonagiri 4:42 పూర్వాహ్నం వద్ద జూన్ 25, 2009

    పార్టీని కూడా అమ్మేస్తే ఓ పని అయిపోతుంది కదా!

  3. 4 Bhaskar 6:34 పూర్వాహ్నం వద్ద జూన్ 25, 2009

    Well said…It is all Political immaturity..If Arvind cooperates with earlier collections, party can sustain till next elections.

  4. 5 నాగప్రసాద్ 11:32 పూర్వాహ్నం వద్ద జూన్ 25, 2009

    చాలా బాగుంది కథ. అప్పుడప్పుడు ఇటువంటివి రాస్తూ ఉండండి. :)


ప్రత్యుత్తరమిమ్ము




వీక్షణలు

  • 77,132

 

జూన్ 2009
సో మం బు గు శు
« మే   జూలై »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

నెలవారీ ఉతికినవి