జూన్ 22nd, 2009ను భద్రపఱచు

గల్లీ నుండి ఢిల్లీ వరకు

‘గల్లీ నుండి ఢిల్లీ వరకు’ గత మూడు రోజులుగా
మన తెలుగు వార్తా చానల్స్ నుండి తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ
ప్రతినిధుల ద్వారా ప్రతిధ్వనిస్తున్న వాఖ్య.

గత మరియు ప్రస్తుత పాలకులు పదే పదే వల్లెవేసే
‘ఆ రోజు మంత్రి పదవి వచ్చివుంటే ఆయన పార్టీ పెట్టెవారా?’
అనేదాంట్లో ఎంతో కొంత నిజమున్నా
రోజు రోజుకూ వాదం బలపడి నమ్మకం పెరిగి
ఆరంభంలో ఊహించిన దానికన్నా
బలీయమైన శక్తిగా, రాష్ట్ర పాలకులను నిర్ణయించే శక్తిగా కాకున్నా
సంకీర్ణం లేకుండా స్వయంగా కేంద్రంలో ఘీంకరించలేని పాలక గజాలకు
మేమే గతి అని గతంలో నిరూపించుకొన్నారు.

ఒకటీ రెండు పార్టీలు మినహా మేము వ్యతిరేకం అని
ధైర్యంగా చెప్పలేని స్థితిని తెప్పించారు.

తెలుగు జాతి గౌరవం అనే నినాదంతో వచ్చి
పాలన సాగించి ప్రత్యేక రాగానాకి తొలుత బుసలు గొట్టి
తరువాత తెలుగు వాడు ఎక్కడ వున్నా మేము వారి
అభివృద్ధికి అడ్డు రాము అంటూ ప్రత్యేక రాగానికి పరవశం చెందారు.

మొదట ఎందుకు బుసగొట్టారు తరువాత ఎందుకు పరవశం చెందారు,
కేవలం ఎన్నికల కోసమే అనే స్వరాలు వినిపించాయి.
కారణం వేరేదైనా గట్టిగా ఖండించలేని పరిస్తితి ఆ పార్టీది.

తెలంగాణా వారు వేరు కావాలంటోంది నిర్లక్ష్యంతో వెనుకబడ్డామని.
మరి అంతవరకు ఏలిన వారు ఆ వాదానికి మద్దతు ఇస్తే వాళ్ళే బాధ్యులు కదా.
ఈ విషయంలోనే తెలుగు జాతి గౌరవం పార్టీ మధన పడి మొదట మద్దతు ఇవ్వక పోయి ఉండవచ్చు.

ఏదైనా కానీ గల్లీ నుండి పోరాడి ఢిల్లీ వరకు వెళ్ళిన పార్టీ లో
ఒంటెద్దు పోకడలతో ప్రజాస్వామ్యంతో ఆడిన పరిహాసాలతో
స్వయంకృతంతో సంఘర్షణలో పడింది.

ఇంత దీర్ఘ కాలం, ఇంతకు మునుపు
ఇంత బలీయంగా ఈ వాదం వినబడలేదు.
అందుకే అంతో ఇంతో సానుభూతితో మళ్ళీ నిలదొక్కు కొనే దానికి గొంతులు కలుస్తున్నాయి.

ప్రస్తుత పాలకులు ఆ రాగానికి అప్పుడు శ్రుతి కలిపి
ఇప్పుడు దానినే అపశ్రుతి చెయ్యడానికీ చేజేతులా చెయ్యాల్సింది అంతా చేస్తున్నారు.
ఆ విషయం గ్రహించి తెలంగాణా వాదులు ఏకం గావలసిన సమయం వచ్చింది.

అలాగే పాలక పార్టీలో ఈ గానాన్ని స్వప్రయోజనాలకు
వాడుకునే వారు కూడా లేక పోలేదు.
గవర్నర్ పదవో రాష్ట్రపతి పదవో లేక కేంద్రంలో మంత్రి పదవికో
అవసరార్ధం వినిపించి ఊరుకొనే వారు కూడా ఉన్నారు.
అంతే కాకుండా రాజాను మెప్పించి ఉన్న మంత్రి పదవిని
కాపాడుకొనే వాగుడు కాయలు కూడా ఉన్నారు.

గజ్జె కట్టితే అంటూ రాజ్యానికి పోయి ఓటమి చెందినా వారు,
పాలక పార్టీలో వృద్ద జంబూకాలుగా పేరొందిన వారు
అమ్ముడు పోయే టైగర్లు పాస్ పోర్ట్ మరియు వీసా కుంభ కోణాల్లో గడ్డి తినే వాళ్ళ వల్లా కూడా
ఈ రాగం అప్పుడప్పుడూ అపశ్రుతికి గురై అపఖ్యాతి పాలవతున్నదని ఆ ప్రాంత ప్రజలు గమనించాలి.


వీక్షణలు

  • 85,827

 

జూన్ 2009
సో మం బు గు శు
« మే   జూలై »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

నెలవారీ ఉతికినవి