ఆదాయపు పన్ను శాఖ ఆడా మగా తేడా ఆపై వయసు తేడాలు మాత్రం చూస్తుంది.
దీనికి మతం కులం ప్రాతిపదికిన ఎటువంటి తేడాలూ తెలియదు.
అలా కాక ఒక పరిధి ధాటి ఆదాయం వచ్చే హిందూ ఆలయాలపై అజమాయిషీ చేసే
హక్కును దక్కించుకొన్న పాలకులు, పాలక సభ్యుల పేరిటి నియమించే వారు
ఎంత నీతిమాలిన వారైనా, హిందువులు భరించారు, భరిస్తున్నారు…
హిందూ మతం తప్పితే మిగిలిన ఏ మత ఆలయ
లోగిలి కి వెళ్ళలేని పాలకులు హిందువుల
ఆలయాల అజమాయిషీలపై నగిషీలు చెక్కడానికి వెర్రి ఆసక్తిని చూపడం పరిపాటి అయ్యింది.
అందులో భాగంగా ఒక మంత్రి వర్యుడు ఇటీవల ప్రవచిస్తూ
ఏ మతస్తులైనా ఆలయాలలో విధులు నిర్వర్తించ వచ్చు
అని తన లౌకిక వాదం చాటుకొన్నాడు .
దర్శనం కోసం గంటల తరబడి వేచి ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి వచ్చే భక్తులను
తమ విధులలో భాగంగా నెట్టే వ్యక్తి ఇతర మతస్తుడైతే సహజంగా ఏమి జరుగుతుందో ఊహించండి.
శిలా రూపాల్లో ఉన్న దేవుళ్లలో సైతాను అంటే దయ్యం ఉందని నమ్మే వాడు
ఏవిధమైన సేవలు అందిస్తాడు ఆలయాల్లో?
ఆ పాటి జ్ఞానం లేదా వీరికి. అన్యమతాల ఆలయాలను వీరు అజమాయిషీ చెయ్యగలరా?
బైబిల్ ను ఒక బ్రాహ్మణుడితో మంత్ర రూపంలో వినిపించే ఆలోచన చెయ్యగలరా?
ఆలయాలలో ఆదాయం వచ్చేది ఇతర మతస్థుల ద్వారా కాదు మరియు పాలకులు, ప్రభుత్వం ఏమీ సహాయం చేయుట లేదు.
ఆ మతాలను నమ్మి సేవ చేసే వారికే ఆ ఆదాయం నుండి తీసి జీతాలు ఇవ్వాలి.
అది వారికే చెందాలి మరియు వారికే హక్కు ఉంటుంది.
ఎపుడో ఒకటీ అరా సందర్భాలు మినహా ప్రశాంతంగా ఉండే
అన్ని మతస్తులలో మళ్ళీ మత జాడ్యాన్ని లేపే ఇలాంటి మాటలకు
మంత్రి వర్యులను బాధ్యులను చేసి బర్తరఫ్ చేయాలి.
ఉతుకులపై ఇటీవలి వ్యాఖ్యానాలు