మన దేశంలో రెండు గంటల పైన ప్రయాణం ఏదైనా బస్సులో వెడితే
తప్పక మనకు ఓ ఇరవై నిమిషాల విశ్రాంతి పేరుతో
ఏదో ఒక డాబా దగ్గరో లేదో ఒక హోటల్ దగ్గరో ఆపుతారు.
అక్కడ ఆ యాజమాన్యాలకు ఎదురులేదు మనకు దిక్కు లేదు.
వాళ్ళు ఇచ్చిందే నాణ్యత, చెప్పిందే ధర.
ఆ ధరలు విని మనం ప్రయాణి స్తున్నది భూమి పైనా లేక అంతరిక్షంలోనా అనే సంశయం వచ్చి
తిరిగి సంభాలించుకొని వాదిస్తే వాళ్ళు మనలను వాజమ్మలను చూసినట్టు చూసి ఎవడితో చెప్పుకుంటావో చెప్పుకో అని చెబుతారు.
మనమీద మనకే జాలి వేసి ముందే ఇవి కొని తెచ్చుకొని ఉంటె బావున్ను అని సమాధానం చెప్పుకొనే వారు కొందరు.
ప్యాకింగు చట్ట ప్రకారం ప్యాకట్టు పై నిర్ణయించిన ధరలకన్నా ఎక్కువ అమ్ముతుంటే ఆక్రోశంతో
చేసేదేమీ లేక ఆ చట్టాలు ఇలా అఘోరిస్తున్నాయి అని ఓ నిట్టూర్పు విడిచి వెళ్లి పోతాము.
తనిఖీలు ఫంక్తి భోజనాలు చేసే రాజకీయ నాయకులకు పట్టవా అంటే వాళ్ళు
రాయతీలు ఉపయోగించుకొనే క్రమంలో ఇవేమీ పట్టించుకోరు
సాటి ప్రయాణికులతో కలిపి ఏనాడూ ప్రయాణించరు.
ప్యాకట్ల పై ప్రదర్శించిన ధరకన్నా ఎక్కువ అమ్మితే ఆ చట్టాన్ని ఉల్లన్గించినట్టు.
ఎక్కువ ధరపై అమ్మే దానికి పన్ను కట్టక మరో చట్టాన్ని ఉల్లంగిస్తారు.
ఇలా గొలుసు కట్టుగా చట్టాలకు ఘోరీ కడుతారు.
అయినా ఏ ప్రభుత్వ తూనికల అధికారి, నాణ్యత చూసే పుడ్ ఇన్స్పెక్టర్, పన్నుల అధికార్లు, రవాణా అధికారులు అటుకేసి చూడరు.
ప్రయాణాల్లోనే కాదు సినిమా హాళ్లలో బస్సు స్టేషనుల దగ్గర ఇలా ఎదేచ్చగా విచ్చల విడిగా జరిగి పోతుంటుంది.
ఎందుకంటే సినిమాల్లోనే భారతీయుడు కనిపిస్తాడు. నిజ జీవితంలో ఎవడూ అవ్వాలనుకోడు.
ఒకవేళ అయితే వాడో వాజమ్మ .. అందుకే మన మీద మనమే జాలి పడడం నేర్చుకోవాలి.
ఉతుకులపై ఇటీవలి వ్యాఖ్యానాలు