కాంగ్రెస్సు మళ్ళీ రాష్ట్రంలో రావడానికి చిరంజీవి
బరిలో నిలవడం ఒక కారణం అని ఎవరైనా ఒప్పుకోక తప్పదు.
కాంగ్రెస్సు చేసే తప్పులకు చిరంజీవి తన తప్పు లేకున్నా
ప్రజల్లో విలన్ గా చోటు సంపాదించుకోక తప్పదు.
ఇది ఏ స్థాయిలో అన్నది కాంగ్రెస్సు చేతకాని తనం పై,
దౌర్జన్యాలపై, అధికార దుర్వినియోగం పై ఆధార పడి ఉంటుంది.
కాబట్టి చిరంజీవి ఈ ఐదు ఏళ్ళు రాజకీయాల్లో ఉండక తప్పదు.
ఉండి కాంగ్రెస్సు చే తక్కువ తప్పులు చేయించి తన విలన్ ఇమేజ్ ని తగ్గించుకోక తప్పదు.
తరువాత తెరమరుగు అయినా రాజకీయాలకు రాం రాం చెప్పినా ఎవ్వరూ బాధ పడరు.
అప్పుడే బియ్యం బాధలు వింటూ చేతకాని తనంతో బీరాలు పలికే పాలన ప్రారంభ మయ్యింది.
ప్యాక్షన్ ఏక్సన్లను ఏలికలు ప్రజలకు చోద్యంగా చూపిస్తున్నారు.
ఎన్నికల ముందు కనిపించని ఐరిష్ కనులు ఇప్పుడు కనపడ్డం మొదలయ్యింది.
ఇలా కాంగ్రెస్స్ పార్టు 2 సినిమా ఉత్తమ విలనిజానికి అద్దంపడుతూ ఆరంబమయ్యి అదరగొడుతుంటే
తప్పక చిరజీవి పై ప్రజల అక్కసు మల్లే అవకాశాలే ఎక్కువ.
కాబట్టి ఇక చిరంజీవి సభల్లో మైకులు బద్దలు కొట్టాల్సిందే
లేదంటే ప్రజల కోపం చిరంజీవి విలన్ ఇమేజిని తారాస్థాయికి చేరుస్తుంది.
ఉతుకులపై ఇటీవలి వ్యాఖ్యానాలు