రాజులు ఒకరి పై ఒకరు దండెత్తి,
గెలిచిన వారు రాజ్యాలు ఏలేవారు.
ఇప్పుడు ఆ శ్రమ అక్కర లేదు ఓడితే
ఒక్క ఐదు లేదా పది సంవత్సరాలు
ప్రజల సభల్లో ప్రస్తుత పాలకులను
దండయాత్ర బదులు దుమ్మెత్తి పోస్తే
తిరిగి వారికే ప్రజలు పట్టం గట్టి గద్దెను ఎక్కిస్తారు.
నెహ్రూ కుటుంభంతో మొదలైన తర తరాలుగా
తమకే గొడుగులు పట్టాలనే సాంప్రదాయం క్రొత్త పుంతలు తొక్కుతోంది.
ఇటీవల తమిళ నాడు లో దానికి నాంది పలికారు.
చెన్న పట్టణ చక్రవర్తిగా తను
తన కుమారుని ఒకరిని యువరాజుగా
హస్తినలో మరొకరిని మంత్రిగా
మనవడిని ఇంకో మంత్రిగా
కుమార్తెను రాజ్య సభకు పంపి
ప్రజాస్వామ్య రాక్షసం చూపుతున్నారు.
హస్తినలో తయారవుతున్న మరో యువ రాజుకు
ఇప్పుడు స్వయంగా అమ్మగారు జయహో చెబుతున్నారు.
ఒక రెండు మూడు సంవత్సరాలకు ముందు కమలంతో
కలవర పడ్డప్పుడు భావి యువరాజు భాద్యత లేదన్నారు.
ఇక మన ప్రదేశ్ కూడా తక్కువేమీ కాదు
భావి యువరాజును చేయడానికి
హస్తినకు పంపి చక్కని బాట వేసాడు ఇక్కడి రాజు.
మనం మాత్రం తప్పకుండా మన తరమే కాదు
రాబోయే తరాలకు కూడా చెప్పి మరీ ఈ ప్రజాస్వామ్య సార్వభౌములను
తలకెత్తు కుంటూ ఉండాలి నేను చెప్పేది మరి తలకెక్కిన్చుకోండి.
ఉతుకులపై ఇటీవలి వ్యాఖ్యానాలు