గాలికి మన పాలకులు ఘనంగా గనుల సహకారం అందిస్తుంటే
ఏదో జరుగుతోంది.. మన కంచె దాటి వచ్చేసారు,
అప్పనంగా నామ మాత్రపు రాయల్టీకి లీజులు ఇచ్చారు,
దేవాలయాలను సెలయేళ్ళను పేల్చి వేసారు అని అభియోగాలను పరిశీలించుటకు
వెళ్ళిన కమిటీ, హెలికాఫ్టర్లో తిరిగి ముచ్చట తీర్చుకొని ఏమి చెప్పారో మనకు తెలిసిందే.
ఆ తరువాత విమానాశ్రయానికి, స్టీలు ప్లాంటులకని
ఎకరాలకు ఎకరాలు ఏలికలు ఏరకంగా ఇచ్చారో కూడా మనకు విదితమే.
అయ్యారే అని మన ఆశ్చర్య పోయేలా ఆ గనుల యజమానులు అంచలంచలుగా ఘనులు అయ్యారు.
కర్ణాటకలో కమలానికి ఖర్చు పెట్టి కుర్చీని ఎక్కించి చాలక పొతే ఆపరేషను కమల అని ఆదుకొని
కాంగీ కంచు కోట బళ్లారిలో కాంగ్రెస్స్ పని తెల్లబోయేట్టు చేసారు.
ఎప్పటికైనా ఇది మనకు ముప్పే నని వారి తెడ్డుతోనే అధికార పీఠం తీరం చేరిన
యెడ్డీ మోకా లడ్డాలని, కంచెలు మీరి అందినకాడికి ఆర్జిస్తున్నారు అంటూ
కేంద్రానికి అందులో అప్పటి మంత్రి కపిల్ సిబాల్ కు లేఖ పంపి కంతిరీగల తుట్టెను తట్టి లేపారు.
పల్లకి మోసే రెండు మూడు జిల్లాల బొయీలు
ఆపరేషను కమలతో అందివచ్చిన వారు గాలి ప్రభావ వంతులే.
గాలి రోజు రోజుకూ ఉద్రుతమై కమలాన్ని గజ గజ వణికిస్తోంది.
శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే దానికి విరుద్దంగా
ఈశ్వరప్ప ఈ ఘనుల ఆజ్ఞలను పాటిస్తూ రోజు రోజుకూ కమలానికి కలవరం తెప్పిస్తున్నాడు.
ఈ గాలి చేయి సాయంతో కమలాన్ని కదిలించేలా ఉందని ఊహాగానాలు.
ఉతుకులపై ఇటీవలి వ్యాఖ్యానాలు