జూన్ 10th, 2009ను భద్రపఱచు

ఊర్లోవాళ్ళ డబ్బుతో ఉగాది పండగ

భాగ్య నగరం అని పేరే కానీ
అందులో వశించే జనాలకు గర్వంగా
ఆ పేరు చెప్పుకొనే భాగ్యం ఎప్పుడో పోయింది.

ఎందుకంటే దాని స్థానే ఆ రెండు బాదుల నగర ట్రాఫిక్తో
బాధేయడం లేదా అనే ప్రశ్న ఎక్కడ ఎదురౌతుందేమోనని భయం.

కొత్తగా జలుబు చేసి భాగ్య నగరం దాటి బయటకు వెళ్లి
భాగ్య నగరం పేరు చెబితే ఎక్కడ స్వైన్ ప్లూ వచ్చిందో అని
పరీక్షలకు పట్టుకు పోతారోనని బెంగ.

ర్యాగింగు చేసే రాక్షలు వీరు అని ఇతర
ప్రాంత కళాశాలల్లో కాస్త దూరం పెడతారో నని కలవరం.

నిజాం కాలం నాటి నల్లా లో వచ్చే నీళ్ళు తాగి
ఎలా బతికి ఉన్నావు అని కింది నుండి పైకి చూసే పరిహాసపు చూపు.

సి వి లో భాగ్య నగరం పేరు పెట్టుకొంటే
ఎక్కడ ఇదంతా ‘సత్యమే’ నా అని అనుకొంటారేమో నని అనుమానం.

ఇన్నిరకాలుగా ఇంటా బయటా భాగ్య నగర జీవులు
పరువు ప్రతిష్ట లతో పరేషాను అయ్యి
అసలే సినిమా నటులను చూసి కన్ఫ్యూజ్ అయ్యి
మళ్ళీ దేవుడి పాలనను తెచ్చుకొని తెగ బాధ పడుతుంటే,

అసెంబ్లీ లో అంతేసే డబ్బులు ఖర్చు పెట్టి ఏవన్నా
మాట్లాడుతారోమో నని చూస్తుంటే ఒకరికి ఒకరు
నవ్వించుకొంటూ పండగ చేసుకొంటున్నారు.

అందుకే అంటున్నా ఊర్లోవాళ్ళ డబ్బుతో ఉగాది పండగ చేసుకోండి అని.
మీకంటే మా బ్లాగుల్లో నయా పైసా ఖర్చులేకుండా జరిగే చర్చే నయం అని.


వీక్షణలు

  • 85,823

 

జూన్ 2009
సో మం బు గు శు
« మే   జూలై »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

నెలవారీ ఉతికినవి