నేను బ్లాగులోకంలో కాలుమోపాను
కసిదీరా ఇంగిలీషులో టైపు గొట్టి
తెలుగులో టపాలేసాను
వెంటనే కూడలిలో టపా తేలి
వరదలో కొట్టుకొని పోయినట్టు
టపాల పరవళ్ళలో
నా టపా పత్తాలేకుండా పోతోంది
సుడిగుండపు కూడలిలో
గడ్డి పోచా కానరాలేదు
కావలసిన హిట్లు రాలేదు
కామెంట్లకోసం ఆర్తనాదం
చేస్తుంటే చేరదీసే వాడు లేదాయే
అందుకే అడ్డంగా ….
భరతుడు దుర్బుద్ధితో
రామునికి అడవిలో చెప్పుల ఆధారం కూడా
లేకుండా చెయ్యడానికే పాదుకలు పట్టుకొచ్చాడు
అట్టని ఇంకో మత పురానమ్లో చెప్పబడిందని
చెత్త ఆధారాలు చూపి పురాణాలను వక్రిస్తే
వాయగొట్టడానికైనా నా బ్లాగుకు వచ్చి
కామెంట్లేసి నా కరిష్మా పెంచుతారేమోనని…
ఓ తింగరి బ్లాగరుగా నన్ను తిట్టుకొన్నా
వైరుధ్య వి’దూషకుడ’ ని ఒప్పుకొంటారని ఓ వెధవ ఆలోచన.
ఉతుకులపై ఇటీవలి వ్యాఖ్యానాలు