అమెరికాలో కొంపలు కొల్లేరై అది కాస్తా ఆర్ఠిక సంక్షోభమై

అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పుడు మనవాళ్లు పెంచేస్తారు.

ప్రస్తుతం అంతర్జాతీయంగా భారీగా చమురు ధరలు తగ్గినా కస్సుబుస్సులాడుతూ కాపురం చేసిన కామ్రేడ్లలా కత్తిపెట్టి మెడపై తగ్గించమని అడిగే యు పి ఎ భాగస్వామి లేడు.

ఈ చమురు ధరలు నిత్యావసరాల ధరలు పెంచి పేదవాని కడుపులో మంటపెడుతున్నాయి.  

ఇదే ద్రవ్యోల్బణమై ఇన్వెస్టర్ల ధనాన్ని కరిగిస్తున్నాయి.

దీనికి తోడు అమెరికాలో కొంపలు కొల్లేరై అది కాస్తా ఆర్ఠిక సంక్షోభమై అంతో ఇంతో ఆధారపడ్డ మనలనూ భయపెడుతున్నాయి.

ఈ రోజు లోక్ సభలో తీరిగ్గా మురళీ దేవరా గారు చమురు ధరల తగ్గింపు పరిశీలనలో వుందని శెలవిచ్చారు దానికి వారం మెలిక పెట్టారు. 

ప్రతిదాన్ని ఓపిగ్గా ఓటుగా మలచడం కన్నా త్వరగా చమురు ధరలు తగ్గించి దీపావళి నైనా చేతిలోని చమురెక్కువ వదలకుండా చేసుకోనిస్తారని ఆశిద్దాం. చేతి చమురు ‘చేతి’లోని పనే.

2 స్పందనలు నుండి “అమెరికాలో కొంపలు కొల్లేరై అది కాస్తా ఆర్ఠిక సంక్షోభమై” కు


  1. 1 రానారె 6:26 అపరాహ్నం వద్ద అక్టోబర్ 23, 2008

    సమాచారం కోసం అడుగుతున్నాను – చమురు ధరలు ఆమాటకొస్తే ఏ ధరలైనా సరే తగ్గడమనేది మన దేశ చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా?

  2. 2 Niranjan Pulipati 9:46 అపరాహ్నం వద్ద అక్టోబర్ 23, 2008

    మన దేశం లో ధరలు ఎప్పుడూ పైకి పెరగటమే కానీ కిందకు దిగవు.. దశరా అయినా దీపావళి అయినా సంక్రాంతి అయినా పాలకులకు ఆ పట్టింపులెందుకు వుంటాయి చెప్పండి.. ?


ప్రత్యుత్తరమిమ్ము




వీక్షణలు

  • 80,941

తడి ఆరని ఉతుకులు

 

అక్టోబర్ 2008
సో మం బు గు శు
    నవం »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

నెలవారీ ఉతికినవి