లేఖల మీద లేఖలు రాసి అలిసి పోవడాన్ని అలుసుగా తీసుకొన్న దయలేని దొంగ

మానాన్న నాకిచ్చిన దానికంటే నా కొడిక్కి ఇంకా ఎక్కువ ఇస్తానని
అవకాశం ఇచ్చిన ఆంధ్రులకు లంచంగా
అడిగిన వాళ్లకు లేదనకుండా బియ్యం కార్డులు ఇచ్చి
దొడ్డబియ్యంతో పండగ చేసుకోమని సలహాలు ఇస్తూ
లక్ష కోతల బడ్జెట్లు పెట్టి కాలవల్లా ధనాన్ని పారించి
ప్రతిపక్షం వై అంటున్నా ఎస్ నేను చేయడం మాననని
తన మానాన తను చేసుకుపోతుంటే
ఒక లేఖకు కూడా సమాధానం రాకున్నా
లేఖల మీద లేఖలు మానకుండా రాసి
ఆయన చనిపోతే లేఖల పరంపర తగ్గించి
అలిసిన శరీరం సేదతీరడాన్ని అలుసుగా తీసుకొన్న దయలేని దొంగ
దొరలా వచ్చి తీరిగ్గా నాలుగు గ్యాసు సిలిండర్లు దొంగలించుకెళ్లాడంట
తెల్లబోయిన దత్తన్న పోలీసులకు ఫిర్యాదు చేసాడంట.

తరువాతి కాగితం »


వీక్షణలు

  • 88,848

 

ఫిబ్రవరి 2010
సో మం బు గు శు
« జన    
1234567
891011121314
15161718192021
22232425262728

నెలవారీ ఉతికినవి